RETRO: 'రెట్రో' సినిమా నుండి ట్రైలర్ విడుదల..! 10 d ago

కోలీవుడ్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రెట్రో' సినిమా మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తుండగా, జయరామ్, కరుణాకరన్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ బ్యానర్లపై నిర్మితమవుతుండగా.. ట్రైలర్ ఈనెల 18న విడుదల కానుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సూర్య, పూజా హెగ్దే కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ ఈ అప్డేట్‌తో ఫుల్ ఖుషీ అవుతున్నారు.